కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు. విజయనగరం , ఆగస్టు 1 (చైతన్యగళం): భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారని కొనియాడారు. రాజధాని అమరావతికి నిధులు ఇచ్చి ప్రధాని అండగా నిలిచారని ఉద్ఘాటించారు. పోలవరం, రైల్వేజోన్‌, విశాఖ ఉక్కును మోదీ కాపాడారని ప్రశంసించారు. ఎయిర్‌పోర్ట్‌కు భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనాలు చేస్తున్నానని...