CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 12:35 pm Posted by : rakeshkashaveni12@gmail.com

తిరుమలలో సాధారణ రద్దీ.. సర్వదర్శనానికి 12–15 గంటలు

తిరుమల, ఆగస్టు 1(చైతన్యగళం):

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. టోకెన్లు లేని సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం భక్తులు సుమారు 12 నుంచి 15 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది.

జూలై 31న ఒక్కరోజే 71,393 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, వారిలో 27,846 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజున శ్రీవారి హుండీకి రూ. 4.46 కోట్ల ఆదాయం సమకూరింది.

అలాగే 4.33 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.58 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమలలోని వైద్య సేవల ద్వారా 3,285 మంది భక్తులకు వైద్య సహాయం అందించారు.