నంద్యాలలో సామాజిక పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి, కలెక్టర్

నంద్యాల, ఆగస్టు 1(చైతన్యగళం): రైతునగర్‌లో మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఇళ్ల వద్దకే చేరి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ స్వయంగా పాల్గొని లబ్ధిదారుల చేతికి పింఛన్లు అందించారు. ప్రజల వద్దకే చేరి పింఛన్లు అందించడం ద్వారా ప్రభుత్వం సామాజిక భద్రత పట్ల చూపుతున్న కట్టుబాటు స్పష్టమైందని అధికారులు పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ విధానం తమకు...