కరీంనగర్ జిల్లా వైద్యాధికారిగా డా. రాజగోపాల్ బాధ్యతల స్వీకరణ
కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిగా విశిష్ట సేవలు అందించిన డా. శ్రీరాం పదవీ విరమణ పొందగా, నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిగా డా. రాజగోపాల్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డా. శ్రీరాం నూతన అధికారికి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది, వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నోడల్ అధికారులు డా. రాజగోపాల్‌ను ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు....