దేశ్ ముఖ్ భూస్వాములను తరిమిన మహావీరుడు కాచం కృష్ణమూర్తి: సిఐటియు
నల్లగొండ, ఆగస్టు 1 (చైతన్యగళం): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, భూస్వాములను, నిజాం రజాకార్లను తరిమిన మహావీరుడు కాచం కృష్ణమూర్తి అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య పేర్కొన్నారు.శనివారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవనంలో కాచం కృష్ణమూర్తి 20వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “కృష్ణమూర్తి గారు పీడిత ప్రజల పక్షాన...