రేపు మాల్ మార్కెట్‌లో జగన్నాథ రథయాత్ర

యాచారం, ఆగస్టు 1 (చైతన్యగళం): యాచారం మండలం మాల్ మార్కెట్‌లో ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని హరే కృష్ణ ప్రచార కేంద్రం నిర్వాహకులు ప్రొద్దుటూరీ దేవేందర్ నాథ్ దాస్ ప్రకటించారు. ఈ రథయాత్ర గోడుకొండ్ల వేణుగోపాల స్వామి ఆలయం నుండి ప్రారంభమై V.T. నగర్, మాల్ మార్కెట్ యూనియన్ బ్యాంక్ వరకు హరినామ సంకీర్తన, భజన పాటలతో కొనసాగుతుంది. అనంతరం ఊరే యాదయ్య గార్డెన్ వద్ద ముఖ్య అతిథుల ప్రవచనాలు,...