CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 12:53 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రేపు మాల్ మార్కెట్‌లో జగన్నాథ రథయాత్ర

యాచారం, ఆగస్టు 1 (చైతన్యగళం):
యాచారం మండలం మాల్ మార్కెట్‌లో ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని హరే కృష్ణ ప్రచార కేంద్రం నిర్వాహకులు ప్రొద్దుటూరీ దేవేందర్ నాథ్ దాస్ ప్రకటించారు.

ఈ రథయాత్ర గోడుకొండ్ల వేణుగోపాల స్వామి ఆలయం నుండి ప్రారంభమై V.T. నగర్, మాల్ మార్కెట్ యూనియన్ బ్యాంక్ వరకు హరినామ సంకీర్తన, భజన పాటలతో కొనసాగుతుంది. అనంతరం ఊరే యాదయ్య గార్డెన్ వద్ద ముఖ్య అతిథుల ప్రవచనాలు, హారతి, అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర నాయక్, బీజేపీ రాష్ట్ర నాయకులు కేతావతు లాలు నాయక్, మాల్ సర్పంచ్ బెల్లి అశోక్, గోడుకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య, అలాగే ప్రవచనకర్తలు H.G. విష్ణు స్వామి దాసు, H.G. రామ లక్ష్మణ్ దాసు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ జగన్నాథ రథయాత్ర కమిటీ సభ్యులు, గోడుకొండ్ల వేణుగోపాల స్వామి ఆలయం చైర్మన్ అల్వాల జంగయ్య, స్థానికులు ఊరే లక్ష్మణ్ గుప్త, కనిగిరి గోవర్ధన్ గుప్త, తడకమళ్ళ లక్ష్మణ్ గుప్త, రాజేశ్ సాగర్, గోవింద రాజు భక్తులను కోరారు.