అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లాలోని పలు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. గంగాధర ప్రాజెక్టులో 20, హుజురాబాద్‌లో 16, కరీంనగర్ రూరల్‌లో 16, కరీంనగర్ అర్బన్‌లో 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు ఆన్లైన్‌లో మాత్రమే స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ అర్హత...