CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 10:05 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం):
కరీంనగర్ జిల్లాలోని పలు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 60 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు.

గంగాధర ప్రాజెక్టులో 20, హుజురాబాద్‌లో 16, కరీంనగర్ రూరల్‌లో 16, కరీంనగర్ అర్బన్‌లో 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు ఆన్లైన్‌లో మాత్రమే స్వీకరించనున్నట్లు తెలిపారు.

ఇంటర్మీడియట్ అర్హత కలిగిన మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గ్రామపంచాయతీ లేదా పట్టణ వార్డు, నగర డివిజన్‌లో స్థానికురాలు అయి ఉండాలని స్పష్టం చేశారు. 01.07.2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులని తెలిపారు.

ఖాళీల వివరాలు, ఎంపిక ప్రక్రియ, రిజర్వేషన్ తదితర సమాచారం కోసం wdcw.tg.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ఈ వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.