సుండిపెంటలో జిల్లా ఎస్పీ సుడిగాలి పర్యటన
పోలీస్ స్టేషన్, సచివాలయం పరిశీలన.. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు శ్రీశైలం, ఆగస్టు 1 (చైతన్యగళం): నంద్యాల జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సునీల్ షొరాణ్ శుక్రవారం సుండిపెంటలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా సుండిపెంట పోలీస్ స్టేషన్‌తో పాటు సచివాలయం–2 భవనం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అర్జీదారుల నుంచి సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఎస్పీ, ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ...