సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతతో పని చేయాలి కలెక్టర్ కే. హైమావతి

సిద్దిపేట, ఆగస్టు 1 (చైతన్యగళం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఆదేశించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విద్య, వైద్యం, రైతు సంక్షేమం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, మౌలిక వసతుల కల్పన, భూగర్భ జలాల పెంపు, గృహ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, మహిళా సాధికారత, మానవ...