రాములపల్లి ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ

ఎలిగేడు, ఆగస్టు 1 (చైతన్యగళం): ఎలిగేడు మండలంలోని రాములపల్లి MPPs పాఠశాలలో శనివారం సర్పంచ్ సిద్ది తిరుపతి యాదవ్ అధ్యక్షతన బాలల గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “గ్రామంలోని ఆరు సంవత్సరాలు నిండిన ప్రతి బాలుడు పాఠశాలలో తప్పనిసరిగా నమోదు కావాలి. పాఠశాల ద్వారానే పిల్లలకు మానసిక, శారీరక, నైతిక ఎదుగుదల లభిస్తుంది. బాల్యాన్ని ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సంతోషంగా గడపాలి. వారి హక్కులను భంగం కలిగించేలా ఎవరూ ప్రవర్తించకూడదు” అని సూచించారు. గ్రామసభలో పిల్లల హక్కులు, విద్య ప్రాముఖ్యత,...