CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 12:42 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ సింహద్వారం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌

ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయన్నారు.

విజయనగరం, ఆగస్టు 1(చైతన్యగళం): ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు(శనివారం) భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ మాట్లాడుతూ… యువతకు ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయన్నారు. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ సింహద్వారమని చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం మారనుందని తెలిపారు.

ఎర్రబస్సు కూడా తిరగని ప్రాంతమని కొందరు హేళన చేశారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కళ్లు తెరిచి చూడండి.. ఎయిర్‌బస్సు తిరిగే ప్రాంతమైంది’ అని తెలిపారు. ఉత్తరాంధ్రలో ప్రతి ఇంటి పండుగ ఇది అని అన్నారు. మన్యం వీరుడు అల్లూరి పేరు ప్రపంచం మొత్తం మార్మోగుతోందని తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా ప్రధాని మోదీది అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు కొనియాడారు.