ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు
కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్, కోతిరాంపూర్ సెక్టార్ పరిధిలోని పోచమ్మవాడ అంగనవాడీ కేంద్రంలో శనివారం తల్లులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీఓ కవిత మాట్లాడుతూ, “ప్రతి ఏటా ఆగస్టు నెలలో అన్ని అంగనవాడీ కేంద్రాల్లో తల్లిపాల విశిష్టతపై వారోత్సవాలు నిర్వహిస్తాం. బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు తప్పనిసరిగా పట్టాలి. మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి” అని సూచించారు. ఆమె...