అఖిల భారత రైతు మహాసభలు విజయవంతం చేయాలని పిలుపు
నల్లగొండ, ఆగస్టు 1 (చైతన్యగళం): నవంబర్‌లో నల్లగొండ జిల్లా కేంద్రంలో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు విజయవంతం కావాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం నల్లగొండ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం ఎం.వి.ఎన్ విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. మద్దతు ధర చట్టం చేయకుండా విద్యుత్ సంస్కరణల బిల్లు తెచ్చి మోటార్లకు మీటర్లు బిగించడం దురదృష్టకరం. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌లకు...