ఉద్ధమ్ సింగ్ త్యాగస్ఫూర్తి – యువతకు ఆదర్శం

మహబూబాబాద్, జూలై 31 (చైతన్యగళం): స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్ 86వ వర్ధంతిని పురస్కరించుకుని వికాస్ జూనియర్ కళాశాలలో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపకుడు డా. కందుల నాగరాజు మాట్లాడుతూ, “జలియన్‌వాలా బాగ్ మారణకాండలో పారిన ప్రతి రక్తపు బొట్టు ఉద్ధమ్ సింగ్ హృదయంలో 21 సంవత్సరాలు ప్రతీకార జ్వాలగా మండింది. 1919 ఘటనకు బాధ్యుడైన మైఖేల్ ఓ’డ్వయర్‌ను 1940లో లండన్‌లో హతమార్చి అమరవీరుల ఆత్మలకు న్యాయం చేశాడు. అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం...