డైలీ వేజ్ కార్మికుల వేతనాల పెంపు – ఎమ్మెల్యేకి ఘన సన్మానం

నందికొట్కూరు, జూలై 31 (చైతన్యగళం): మున్సిపాలిటీ డైలీ వేజ్ కార్మికుల వేతనాలను రూ.9 వేల నుండి రూ.15 వేల వరకు పెంచిన స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్యను మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డిను సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ, “మున్సిపాలిటీ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులకు బ్లౌజులు, నూనె, శానిటైజర్ సరఫరా చేయాలి. చనిపోయిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలను ఆదుకొని ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి” అని వినతిపత్రం అందజేశారు.సిఐటియు నాయకులు...