అక్రమాలపై స్పందించని ఎమ్మిగనూరు ఎంఈఓపై చర్యలు కోరుతూ వినతి

కర్నూలు, జూలై 31(చైతన్యగళం): ఎమ్మిగనూరు మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అక్రమాలపై స్పందించకపోవడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వేటూరి రంగస్వామి డీఈఓ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆసదుల్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ, “ఎమ్మిగనూరు మండల పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలలు — లలిత అలియాస్ ప్రతిభ విద్యానికేతన్ యూపీ, మేధా ప్రాక్సిస్ — అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా శాఖలు...