‘మా పాఠశాల పక్కన క్వారీ వద్దు’.. అధికారుల ఎదుట విద్యార్థుల ఆవేదన

అకుతోటపల్లిలో క్వారీ ప్రతిపాదనపై కలెక్టర్ ఆదేశాలతో సంయుక్త తనిఖీ.. గ్రామస్తుల అభ్యంతరాల నమోదు ఆమనగల్లు, జూలై 31 (చైతన్యగళం): అకుతోటపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 302, 304లో ప్రతిపాదిత క్వారీ, స్టోన్ క్రషర్ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ శాఖల అధికారులు శుక్రవారం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ముందుగా ప్రతిపాదిత గని ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు అనంతరం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులను...