సర్ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, జూలై 31 (చైతన్యగళం): హుజూరాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను టీపీసీసీ కోఆర్డినేటర్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాంపూర్, రంగాపూర్ గ్రామాలను సందర్శించి సూపర్వైజర్లు, బీఎల్ఏలతో సమావేశమయ్యారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు వివరాల సవరణకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ప్రతి అర్హుడికి అందాయా, వాటిని సక్రమంగా నింపి అధికారులకు అందించారా అనే విషయాలను గ్రామస్తులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా అర్హులైన ఓటర్లు...