విద్యార్థుల ఫీజు బకాయిలపై బీజేవైఎం సమరశంఖం

‘ఫీజుల బకాయి–బీజేవైఎం లడాయి’ కార్యక్రమంతో కళాశాలల్లో విద్యార్థులతో ముఖాముఖి హైదరాబాద్‌, జూలై 31 (చైతన్యగళం‌): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి, వారి చదువుకు భరోసా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) చేపట్టిన ‘ఫీజుల బకాయి–బీజేవైఎం లడాయి’ కార్యక్రమం హస్తినాపురం డివిజన్‌లో కొనసాగింది. విద్యార్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వనస్థలిపురం డివిజన్‌లోని శ్రీ వశిష్ట జూనియర్‌ కళాశాల, ఎక్సెల్‌ జూనియర్‌ కళాశాల, క్షేత్ర...