మహబూబాబాద్, జూలై 31(చైతన్యగళం):
సంగీతాభిమానుల కోసం ఆగస్టు 2వ తేదీన మహబూబాబాద్ పట్టణంలోని బ్రహ్మం గారి గుడి వద్ద ఉన్న ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సంగీత లహరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు లక్ష్మీ నారాయణ గారు మరియు శ్రీ రామకృష్ణ గారు పాల్గొని సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కొనసాగనుంది. సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
మరిన్ని వివరాలకు:
లక్ష్మీ నారాయణ – 970135105
శ్రీ రామకృష్ణ – 9989677969