అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాం – మంత్రి గడ్డం వివేకానంద
మంచిర్యాల, జూలై 30(చైతన్యగళం): ప్రస్తుతం కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని, అత్యవసర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. గురువారం మందమర్రి మున్సిపల్ పరిధిలోని 19, 7వ వార్డుల్లో వర్షాల ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఏసీపీ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగుతో కలిసి పరిశీలించారు. కామాఖ్య...