ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ 

మంచిర్యాల, జూలై 30(చైతన్యగళం): జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన మూడు నెలల సన్నబియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు తెలిపారు. జిల్లాలో సర్వర్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట్ల ఈ-పాస్ ఇంజనీర్లు వెంటనే పరిష్కరిస్తున్నారని, సన్నబియ్యం నిల్వలు తగినంతగా ఉన్నందున ప్రతి అర్హులైన రేషన్ కార్డుదారునికి బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పంపిణీ కార్యక్రమం ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని, లబ్ధిదారులు తొందరపడకుండా...