ఘనంగా గోరింటాకు పండుగ జరుపుకున్న మహిళలు
నల్లగొండ, జులై 30 (చైతన్యగళం): నల్గొండ పట్టణ శివారులోని హ్యాపీ హోమ్స్ లో గురు వారం మహిళలు గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్నారు. తొలుత కాలనీకి చెందిన మహిళలందరూ సామూహికంగా చెట్ల నుండి గోరింటాకును తీసుకువచ్చి, గౌరీ దేవి ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గౌరీ పూజ అనంతరం సంప్రదాయబద్ధంగా గోరింటాకు నూరి, చేతులపై రకరకాల డిజైన్లలో పెట్టు కున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. ఏ శుభకార్యం జరిగినా గోరింటాకు ను పెట్టుకోకుండా మహిళలు శుభకార్యాలు మొదలు పెట్టరని అన్నారు.గోరింటాకు వల్ల...