శిక్షణ ఫలితాలు విద్యార్థుల అభ్యున్నతికి దోహదపడాలి
సీరోల్‌లో ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో ఎంఈవో లచ్చిరాం సీరోల్, జూలై 30 (చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు రెండు విడతలుగా నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమం గురువారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) లచ్చిరాం మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో సమర్థంగా అమలు చేసి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రతిరోజూ సాయంత్రం గంటపాటు...