- సీరోల్‌లో ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో ఎంఈవో లచ్చిరాం
సీరోల్, జూలై 30 (చైతన్యగళం):
మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు రెండు విడతలుగా నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమం గురువారం ముగిసింది.
ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) లచ్చిరాం మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో సమర్థంగా అమలు చేసి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రతిరోజూ సాయంత్రం గంటపాటు రెమెడియల్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. చదవడం, రాయడం, గణితంలోని నాలుగు ప్రాథమిక ప్రక్రియలపై ప్రతి విద్యార్థికి పూర్తి పట్టు కల్పించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యాభివృద్ధే లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిక్షణలో రిసోర్స్ పర్సన్స్‌గా సేవలందించిన బాబురావు, కిరణ్ కుమార్, చంద్రశేఖర్, హారిక, ప్రశాంతి, ఉషారాణితో పాటు స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బంగారినిని సన్మానించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది పాల్గొన్నారు.