మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు

ఇరాన్–అమెరికా ఘర్షణలతో ప్రపంచ ఆందోళన.. చమురు మార్కెట్లు, భద్రతపై ప్రభావం టెహ్రాన్ / వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఘర్షణలు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్షిపణి దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. దాడులు.. ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు ఇరాన్‌కు సంబంధించిన వ్యూహాత్మక లక్ష్యాలపై...