అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు అడుగులు వేయాలి: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
కల్వకుర్తి, జూలై 30(చైతన్యగళం): నిరుద్యోగ యువత అందుబాటులో ఉన్న ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అదే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, TASK సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన జాబ్ డ్రైవ్–ఇంటర్వ్యూ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ఉద్యోగ విపణిలో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యువత తమ నైపుణ్యాలను నిరంతరం...