కార్యాచరణ ఆధారిత బోధనతో విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలి

ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్-సర్వీస్ శిక్షణలో సెంటర్ ఇన్‌చార్జ్ మందుల శ్రీరాములు మహబూబాబాద్, జూలై 30(చైతన్యగళం): జిల్లాలో నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్‌లో భాగంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు నిర్వహించిన డెమో క్లాస్‌ను సెంటర్ ఇన్‌చార్జ్ మందుల శ్రీరాములు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధనలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచేలా ఫార్మేటివ్ యాక్టివిటీలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఆటల ద్వారా అభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, క్రమశిక్షణ వంటి విలువలను...