CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 9:01 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కార్యాచరణ ఆధారిత బోధనతో విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలి

  • ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్-సర్వీస్ శిక్షణలో సెంటర్ ఇన్‌చార్జ్ మందుల శ్రీరాములు

మహబూబాబాద్, జూలై 30(చైతన్యగళం):
జిల్లాలో నిర్వహిస్తున్న ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్‌లో భాగంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు నిర్వహించిన డెమో క్లాస్‌ను సెంటర్ ఇన్‌చార్జ్ మందుల శ్రీరాములు గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధనలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచేలా ఫార్మేటివ్ యాక్టివిటీలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఆటల ద్వారా అభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, క్రమశిక్షణ వంటి విలువలను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.

డెమో క్లాస్‌లో ఉపాధ్యాయులు వినూత్న బోధనా విధానాలు, కార్యాచరణ ఆధారిత అభ్యాసాన్ని ప్రదర్శించగా వాటిని ఆయన అభినందించారు. ప్రతి విద్యార్థి చురుకుగా పాల్గొనేలా తరగతి గది కార్యకలాపాలను రూపొందించి, శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు చాంప్ల నాయక్, సురేందర్, హిమాం నాగేష్‌తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.