నంద్యాల పోలీసులకు ప్రత్యేక ధ్యాన శిక్షణ
నంద్యాల, జూలై 30 (చైతన్యగళం): నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాలలో జిల్లా పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ సహకారంతో, రిటైర్డ్ డీజీపీ ఆదిత్య ఆర్య, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదిత్య ఆర్య మాట్లాడుతూ, “పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవి. నిరంతర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసులకు ధ్యానం మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఉత్తమ సాధనం” అని వివరించారు. ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా...