సుల్తాన్‌పూర్ రోడ్డుపై కేజీవీల్ ట్రాక్టర్ పట్టివేత

ఎలిగేడు, జూలై 30 (చైతన్యగళం): మండలంలోని సుల్తాన్‌పూర్ ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా కేజీవీల్ ట్రాక్టర్ నడుపుతున్న వాహనాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై మధుకర్ వివరాల ప్రకారం, కానిస్టేబుల్ ఇమ్రోజ్ పెట్రోలింగ్ విధుల్లో ఉండగా, రోడ్డుపై తిరుగుతున్న ట్రాక్టర్‌ను గమనించి అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ యజమాని, డ్రైవర్ కీర్తి రాజేష్తో పాటు టీఎస్04ఈఎఫ్ 2186 నెంబరు గల ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యాకన్నకు అప్పగించారు. ఎస్సై మధుకర్ మాట్లాడుతూ, “కేజీవీల్ (ఇనుప చక్రాలు)తో ట్రాక్టర్ లేదా ఇతర వాహనాలను...