CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 9:33 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే గిత్త

  • నెహ్రు నగర్ ప్రజల పట్ల ప్రత్యేక దృష్టి

నందికొట్కూరు, జూలై 30 (చైతన్యగళం):
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటింటా టీడీపీ అభివృద్ధి పరిచయం కార్యక్రమంలో భాగంగా గురువారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నెహ్రు నగర్ పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై, గ్రామంలోని డ్రైనేజీలు, రోడ్లు, కల్వర్టులను పరిశీలించారు. “అధికారులు ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి” అని ఎమ్మెల్యే హెచ్చరించారు.ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోవడం, రుతుపవనాలు బలహీనపడటం వల్ల తాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని ఆయన వివరించారు.ఈ పర్యటనలో పగిడ్యాల మండల కన్వీనర్లు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.