వైభవంగా మైసమ్మ దేవాలయ ప్రతిష్టా మహోత్సవం

కరీంనగర్, జూలై 30 (చైతన్యగళం): కరీంనగర్ పదో డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ మైసమ్మ అమ్మవారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ కొమరయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్టా కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. కాలనీ ప్రజలు అందరూ కలిసికట్టుగా బోనాలు సమర్పించి అమ్మవారి...