2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: రేవంత్‌రెడ్డి
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యా వ్యవస్థే లక్ష్యం ఫిన్‌లాండ్, జర్మనీ పర్యటన ముగించుకుని వచ్చిన ఉపాధ్యాయులతో ఎంసీహెచ్‌ఆర్డీలో ముఖాముఖి హైదరాబాద్, జులై 30(చైతన్యగళం): రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా విధానాన్ని తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన వ్యాఖ్యానించారు. డాక్టర్ ఎం.సీ.హెచ్‌ఆర్‌డీలో గురువారం నిర్వహించిన ‘టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌చేంజ్’ కార్యక్రమంలో భాగంగా ఫిన్‌లాండ్, జర్మనీ...