హిందుత్వం మతం కాదు.. భారతీయ జీవన విధానం

ఆత్కూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు 'కర్మవీరులారా కదిలి రండి' గీతం ఆవిష్కరణ.. విద్యార్థులతో మాట–మంతి ఉంగుటూరు(చైతన్యగళం): హిందుత్వం అనేది ఏ ఒక్క మతానికీ పరిమితమైన భావన కాదని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విలువలను ప్రతిబింబించే జీవన విధానమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 'కర్మవీరులారా కదిలి రండి' గీతాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన 'విద్యార్థులతో...