33వ వార్డులో ఘనంగా వనమహోత్సవం

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ మహబూబాబాద్, జూలై 30(చైతన్యగళం): మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డులో గాంధీ పార్కు సమీపంలో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్, 33వ వార్డు కౌన్సిలర్, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ మాట్లాడుతూ, చెట్లు మానవాళి మనుగడకు...