- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్
మహబూబాబాద్, జూలై 30(చైతన్యగళం): మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డులో గాంధీ పార్కు సమీపంలో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్, 33వ వార్డు కౌన్సిలర్, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ మాట్లాడుతూ, చెట్లు మానవాళి మనుగడకు జీవనాధారమని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర కీలకమని, గాలి కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలిని అందించేది చెట్లేనని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వార్డు అధికారి శ్రీహరి క్రాంతి, 25వ వార్డు కౌన్సిలర్ నర్రా సంధ్యా శ్రావణ్, పెరుగు కుమార్, అజ్మీర వేణు, మాలోతు రవీందర్, నీలం వెంకటేశ్వర్లు, పడిదల కవిత, బిక్కు సాయి, యూసుఫ్, నాగేంద్రబాబు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.