అణు కేంద్రాల దిశగా దూసుకెళ్తున్న మంటలు.. అప్రమత్తమైన అధికారులు
ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు పారిస్(చైతన్యగళం): ఫ్రాన్స్‌లో చెలరేగిన భారీ కార్చిచ్చు దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తీవ్రమైన ఎండలు, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తూ విస్తారమైన అటవీ ప్రాంతాలను బూడిద చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, నైరుతి ప్రాంతాల్లో పరిస్థితి మరింత విషమంగా మారింది. మంటలు కొన్ని అణు, రక్షణ సంబంధిత కీలక పరిశ్రమల పరిసర ప్రాంతాలకు చేరువ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సున్నితమైన పరికరాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు కొన్ని కేంద్రాల కార్యకలాపాలపై పరిమితులు విధించారు....