విధుల్లో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు – జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

నంద్యాల, జూలై 30 (చైతన్యగళం): జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గురువారం ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయ ఆవరణ, పరిసర ప్రాంతాల పరిశుభ్రతను పరిశీలించి ఎల్లప్పుడూ శుభ్రతను కాపాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.తరువాత రెవెన్యూ పరిపాలన, రీ-సర్వే పెండింగ్ అంశాలు, ప్రజలకు అందిస్తున్న సేవల పురోగతిపై ఆర్డీవో, తహసీల్దార్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. “ప్రజలకు సంబంధించిన ప్రతి దరఖాస్తు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే పరిష్కరించాలి. బియాండ్ SLA కేసులు ఏవీ ఉండకూడదు. విధుల్లో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వొద్దు” అని...