అకుతోటపల్లి క్వారీ ఫిర్యాదుపై కలెక్టర్ స్పందన

జూలై 31న సంయుక్త తనిఖీలు ఆమనగల్లు, జూలై 30 (చైతన్యగళం): అకుతోటపల్లి గ్రామంలోని సర్వే నెం.304లో ప్రతిపాదిత క్వారీలు, స్టోన్ క్రషర్ ఏర్పాటుపై గ్రామ ప్రజలు, రైతులు సమర్పించిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం స్పందించారు. ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్, సంబంధిత శాఖలు సంయుక్తంగా స్థల తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గనులు & భూగర్భశాఖ, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, తహసీల్దార్ కార్యాలయ అధికారులు కలిసి జూలై 31, 2026 ఉదయం 10:30...