కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభం

కరీంనగర్, జూలై 30 (చైతన్యగళం): రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ఘనంగా ప్రారంభించారు. మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో బస్సులు నడపడం ప్రారంభించారు. అనంతరం మంత్రి స్వయంగా బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు, లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన...