భారీ వర్షాలపై అప్రమత్తం.. 24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
సిద్దిపేట, జూలై 30 (చైతన్యగళం): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ సంజయ్ జాజు, భారత వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ప్రతి జిల్లా...