CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 10:38 am Posted by : rakeshkashaveni12@gmail.com

18 గంటలు వేచి… శ్రీవారి సర్వదర్శనం

తిరుపతి, జూలై 29 (చైతన్యగళం):

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది.

జూలై 28, 2026న మొత్తం 78,709 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా ₹4.76 కోట్ల ఆదాయం లభించింది. 31,312 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 3.97 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.26 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే 2,939 మంది భక్తులు వైద్య సేవలను వినియోగించుకున్నారు.