గురుపూజోత్సవంలో వేదపండితులకు ఘన సన్మానం
రాజన్న సిరిసిల్ల, జూలై 29 (చైతన్యగళం): జిల్లా బీజేపీ అధ్యక్షుడు, ధార్మిక సెల్ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలోని బందనకల్ వాసుదేవ ఆశ్రమ రుక్మిణి వేణుగోపాల స్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితుడు రేపాక రామశర్మకు గురుపూజోత్సవం నిర్వహించి, శాలువాతో సత్కరించి వారి ఆశీర్వాదాలను పొందారు. అనంతరం ముస్తాబాద్ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజ్య రాజు గురుస్వామిని సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా...