CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:58 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గురుపూజోత్సవంలో వేదపండితులకు ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల, జూలై 29 (చైతన్యగళం):
జిల్లా బీజేపీ అధ్యక్షుడు, ధార్మిక సెల్ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలోని బందనకల్ వాసుదేవ ఆశ్రమ రుక్మిణి వేణుగోపాల స్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా వేదపండితుడు రేపాక రామశర్మకు గురుపూజోత్సవం నిర్వహించి, శాలువాతో సత్కరించి వారి ఆశీర్వాదాలను పొందారు. అనంతరం ముస్తాబాద్ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజ్య రాజు గురుస్వామిని సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి హాజరయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మెరుగు అంజాగౌడ్, మండల అధ్యక్షులు సౌల్లా క్రాంతి కుమార్, కోడె రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు ఎదునూరి గోపి, బుచ్చెల్లి మహేశ్వరి, మండల కోశాధికారి జిల్లెల్ల మల్లేష్, ఉపసర్పంచ్ దగ్గు నవీన్, నాయకులు తోట్ల మల్లేష్ యాదవ్, చికోటి మహేశ్, ఆర్. శ్రీనివాస్, సీనియర్ నాయకులు కస్తూరి గాల్ రెడ్డి, కరెడ్ల రమేష్, కస్తూరి కార్తీక్ రెడ్డి, బూత్ అధ్యక్షులు దీటి సత్యం, నిరటి సాయికుమార్, రాగుల వంశీ, వినయ్, చల్ల శివకృష్ణ, ఆకాశ్, వెంకటేష్, పున్నం అనిల్, శ్యామ్ తదితరులు, బీజేపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “గురు పరంపర గొప్పతనం అపారమైనది. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో గురువుల పాత్ర అత్యంత విశిష్టమైనది” అని కొనియాడారు.