వర్చువల్ సిమ్‌తో ‘తల్లికి వందనం’ నగదు మాయం!
ఓటీపీ చెప్పి మోసపోయిన లబ్ధిదారులు.. 36 వర్చువల్ సిమ్‌లతో నిందితుడి అరెస్టు కోట్లలో లావాదేవీలు జరిగినట్లు పోలీసుల అనుమానం కర్నూలు, జూలై 29(చైతన్యగళం): ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. వర్చువల్ సిమ్‌లను ఉపయోగించి లబ్ధిదారులకు ఫోన్ చేసి, పథకం నగదు ఖాతాలో జమైందంటూ నమ్మించి ఓటీపీలు సేకరించారు. అనంతరం బ్యాంకు ఖాతాల్లోని నగదును కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. కర్నూలు నగరానికి చెందిన పలువురు బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు....