భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత

సుల్తానాబాద్, జూలై 29(చైతన్యగళం): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత పిలుపునిచ్చారు. అత్యవసర పనులు ఉంటే మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు.ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ 10వ వార్డులోని గాంధీనగర్, దర్గా నగర్ ప్రాంతాల్లో వర్షంలోనే పర్యటించిన ఆమె, రోడ్లపై నిలిచిన వర్షపు నీరు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా బంధువుల ఇళ్లకు...