గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ సాయిబాబ స్వామిని దర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, జూలై 29 (చైతన్యగళం): గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) హనుమాన్‌పేటలోని శ్రీ సాయిబాబ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తదనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. గురుపౌర్ణమి ఆధ్యాత్మికతను, గురువుల గొప్పతనాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ధర్మబద్ధమైన జీవనం సాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,...